29, మార్చి 2010, సోమవారం

సిరిసిరి మువ్వ శతకం ప్రాచీన కావ్యలక్షణాలు

     శ్రీశ్రీ అంటే శ్రీరంగం శ్రీనివాస రావని కొత్తగాచెప్పాల్సిన అవసరంలేదు,కాని సిప్రాలి అంటే ఏమిటి?అని అడిగే సాహిత్యేతర మిత్రులు అడపాదడపా కనిపిస్తూనేఉంటారు.
      శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ అయినట్టే
        సిరిసిరి మువ్వ శతకం
        ప్రాసక్రీడలు
        లిమరుక్కులు
     మూడింటిమొదటి అక్షరాల కలయికే సిప్రాలి అయింది.
      శ్రీశ్రీగారి సిప్రాలి రాసింది,ప్రచురించింది అమెరికాలోనే(1981).50ప్రతిలు స్వదస్తూరీతో మిమియోగ్రాఫ్ తీసి ,కాపీ 10డాలర్ల చొప్పున అక్కడికక్కడే అమ్మెసారట

                                                   (శ్రీశ్రీ సాహిత్య సర్వస్వం 14వ భాగం మనవిమాటల్లో చలసాని ప్రసాదరావుగారు)


    ఛందోబంధోబస్తులన్నీ తెంచేసుకున్న శ్రీశ్రీ గారు ఛందస్సుతో ఓశతకం రాయడం వింతగా అనిపిస్తున్నా,వారు తన సాహితీ ప్రస్తానాన్ని పద్యాలతోనే ఆరంభించారు.

                  సాయంప్రస్ఫుట రాగరంజితలసస్సంపూర్ణ సౌదర్య రా

                  శీ యుక్తామల దివ్య సౌందర్య మూర్తివయి సాక్షీభూత నానామరు

                  త్తొయస్తోత్ర గభీర రస సంతుష్టాంతరంగంబునన్

                  మాయామేయ జగద్వినాశమతిన్ నర్తింపుమాశంకరా

                  అనే పద్యంగాని

               గాలియొసగెడు కొత్త రెక్కలధరించి

               అతినిరాఘాటముగ విహాయపథాల

              నెరుకపడరానియెచటకొ ఎగిరిపోదు

     అనే భావగీతంగాని శ్రీ శ్రీ రాసారంటే నమ్మశక్యంకాదు.ఇలాంటిరచనలు సుమారు 1929 వరకు చెసారు.1930లో టైఫాయిడ్ జ్వరమునుండికోలుకున్న తర్వాత పంథామార్చుకున్నారు.అంతవరకు తనను నడిపించిన తెలుగు సాహిత్యాన్ని తానునడిపించడం మొదలుపెట్టారు.తెలుగు కవిత్వాన్ని నూతనమార్గంపట్టించారు.మహాప్రస్తానం సాగించారు .ఖడ్గసృష్టిచేసారు.
    తిరిగి చరమదశలో పద్యరచన మొదలుపెట్టి ,తన ఎనిమిదవ ఏటనే పొట్టి పొడుగుపాదాలతో రాసి వదిలేసిన కందాలను తిరిగి చేపట్టి ,వాటికి కొత్తసొగసులద్ది ,సిరిసిరిమువ్వ శతకం రాసారు.
   కందం అంటే
  తిక్కన,చౌడప్ప, శ్రీశ్రీ అంతే!.కందం రాస్తేనేకవి అనేమాట్ ఎలాఉన్నా,సిరిసిరిమువ్వ శతకం చదివాక శ్రీశ్రీ రాస్తేనేకందమనిపించకపోదు.
                 తిక్కన కందంలో భారతకథ ఉంటే
                 చౌడప్ప కందంలో బూతిలు ,నీతులు ఉన్నయి
                 శ్రీశ్రీ కందంలో లోకరీతులున్నయి
     సిరిసిరిమువ్వ శతకాన్ని పరిశీలిస్తే అభ్యుదయభావాలు,ఆడునిక విషయాలు కనిపిస్తున్నా, రచనమాత్రం ప్రాచినపంథాలోనేసాగింది
  శ్రీశ్రీ ప్రకృతి ఐతే సిరిసిరి వికృతి
  సిరిసిరి మువ్వ శతకంలో 11 భాగాలున్నయి .నిజానికి శ్రీశ్రీ వాటిని భాగాలనలేదు.అవసరమనిపిస్తే ప్రత్యేక శీర్శికలుంచాడు, లేకపోతె ఒకటి,రెండు అని పొడి అక్షరాలతో సూచించడు.
          బాల్యంలోవదిలేసిన పద్యరచనను తిరిగి ప్రారంభిస్తూ
              మళ్ళీ ఇనాళ్ళకి ఇ
              న్నేళ్ళకి పద్యాలు రాయుటిది యెట్లన్నన్
              పళ్ళూడిన ముసిలిది
              కుచ్చిళ్ళు సవరించినట్లు  సిరిసిరి మువ్వా !
    అని జ్ఞాపకాలను సవరించుకున్నారు.

  సిరిసిరిమువ్వ శతకాన్ని పరిశీలిస్తే అభ్యుదయభావాలు,ఆడునిక విషయాలు కనిపిస్తున్నా, రచనమాత్రం ప్రాచినపంథాలోనేసాగింది
  శ్రీశ్రీ ప్రకృతి ఐతే సిరిసిరి వికృతి
  సిరిసిరి మువ్వ శతకంలో 11 భాగాలున్నయి .నిజానికి శ్రీశ్రీ వాటిని భాగాలనలేదు.అవసరమనిపిస్తే ప్రత్యేక శీర్శికలుంచాడు, లేకపోతె ఒకటి,రెండు అని పొడి అక్షరాలతో సూచించడు.
          బాల్యంలోవదిలేసిన పద్యరచనను తిరిగి ప్రారంభిస్తూ
              మళ్ళీ ఇనాళ్ళకి ఇ
              న్నేళ్ళకి పద్యాలు రాయుటిది యెట్లన్నన్
              పళ్ళూడిన ముసిలిది
              కుచ్చిళ్ళు సవరించినట్లు  సిరిసిరి మువ్వా !
    అని జ్ఞాపకాలను సవరించుకున్నారు.
   తిక్కనకు హరిహరనాథుడి కలలో శ్రీశ్రీకి చక్రపాణిగారు కలలోకనిపించి ,ఒకశతకం రాసి తనకంకితకీయమని అడిగాడట .శతకకన్యను పుచ్చుకొని కన్యాశుల్కంగా ఒక సిగరెట్టిస్తానన్నాడట .
  
       నీకో సిగరెట్టిస్తా
       నాకో కావ్యమ్ము రాసి నయముగనిమ్మా
       త్రైకాల్య స్థాయిగ నీ
       శ్రీకావ్యము వరలునోయి సిరిసిరి బాయీ !      అన్నారట
     ఇంకా
    
       నీలాంటివాళ్ళతోనే
       ఈలోకం ముందిముందుకేగునుసుమ్మా
       ఆలస్యం ఎందుకిక?నీ
       క్ష్వేలారుతమందుకొనుము  సిరిసిరి నేస్తం     అని ప్రేరేపించాడట
   సంపాదక సాక్షాత్కారం అనే ఈ రెండవ భాగాన్ని ప్రాచిన కావ్యాలలోని అవతారికతో పోల్చవచ్చు. శ్రీశ్రీది భారద్వాజస గోత్రమట.
    ఈ రెండవభాగంలోమాత్రం మకుటనియమోల్లంగన జరిగింది .సిరిసిరి మువ్వా ,సిరిసిరి  మురళీ ,సిరిసిరి మౌనీ
.సిరిసిరి బాయీ ,సిరిసిరి గాగూ ,సిరిసిరి నేస్తం ,సిరిసిరి రావూ  అనేవి మకుట స్థానంలో కనిపిస్తాయి
  ఈమకుట నియమోల్లంగనానికి శ్రీశ్రీ ఆద్యుడుకాడు.తొలి తెలుగు శతకముగా చెప్పబశుతున్న శివతత్వసారంలో కూడాఇదికనిపిస్తుంది  శివతత్వసారంలో శివా,అజా,రుద్రా,మహేశా అనే మకుటాలు కనిపిస్తాయి
   సంపాదక సాక్షాత్కారం అనే రెండవ భాగం దాదాపు ప్రథమ పురుషలోనే సాగింది .ఇదికూడా ప్రాచిన కావ్య సాంప్రదాయమే. నన్నయను రాజరాజ నరేంద్రుడు  ,అల్లసాని వారిని రాయలు పొగిడిన పద్యాలు ప్రథమ పురుషలోనేఉన్నాయి.
  ఇక మూడవ భాగంవిషయానికొస్తే ఇది ఇష్టదేవతాప్రార్థన అనే శీర్శికతో కనిపిస్త్తుంది.ఐతే  శ్ర్తిశ్రీ గారు ఏదేవునీప్రార్థించలేదు.కనీసం దేవునిపేరైనా ఎత్తలేదు.పూర్వకవి స్తుతిచేసాడంతే.
  దీనిని  పూర్తిగా పూర్వ కవిస్తుతిగా కూడా చెప్పలేము .ఎందుకంటే కవులతోపాటు .ఆయాకవుల చేసృష్టించబడ్డ పాత్రలుకూడాకనిపిస్తాయి.
   తెనాలి రామకృష్ణుని ,చౌడప్పను, కూచిమంచి జగ్గకవిని, కృష్ణశాస్త్రిని,వేమనను,జరుక్ శాస్త్రిని ,
  శ్రీనాథుని  టిట్టిభశెట్టిని ,గురజాడ గిరీశాన్ని .పానుగంటి జంగల శాస్త్రులను తలచుకున్నాడు .
  వారంతా వ్యంగ్యంగా సమాజాన్ని, సమాజంలోని లోపాలను ఎత్తిచూపిన కవులు,పాత్రలు    
   శ్రీరంగ నీతులు,వైరాగ్యపద్దతి,మూర్కపద్దతి,కుకవినింద,ఉపాలంభనం.చాటువులు అనేవి మిగిలిన భాగాలు.
 కుకవినిందకూడ ప్రాచినకావ్యాలలో కనిపించేదే.ఈ భాగంలో శ్రీ శ్రీ ఎవరినీ పేరెట్టి నిందించలేదు పైగా
        నాకెమో లోకంలొ
        కాకవులే కానరారు కవిదూషణ  న
        న్నాకర్షించదు ,రచనో
        త్సేకాన్నే మెచ్చుకొందు సిరిసిరిమువ్వా !  అన్నాడు .అంటూనే...
    
        బండెడుచెత్తను ఛంద
       శృండముగా  పోగుచేసి సారస్యము చూ
       డండని రంకెలువేస్తే
       చెండాడెద నట్టివారి సిరిసిరిమువ్వా!    అని వార్నింగిచ్చాడు.
  
      కుకవియన నామతంలో
      ఒకడే ,తనగొప్ప యెదిరిన్యూనత  చూసే
      వికలమతి ,వానిపై నా
      చికటారిని నూరదలతు సిరిసిరిమువ్వా !  అని సూటిగా చెపాడు .

ఉపాలంభనం పేరుతో ఉపసం హారముంది
  దెన్నైతే పూర్వంకా
  దన్నామో,రాక్షసత్వమని యెంచామో
  దాన్నేఆరాధిస్తే
  చిన్నతనం వేరెకలదె సిరిసిరిమువ్వా!అనివాపోతాడు శ్రీశ్రీ

    నేటిపాఠ్య పుస్తకాల్లొ  చాటువుల్లో భాగంగా  పొడుపుకథలు చెర్చినట్టు,తన సిరిసిరి మువ్వ శతకంలో చాతువులు చేర్చాడు  శ్రీ శ్రీ  .
   ఈచాటువులు కూడాఛందోనియమాన్ని ,మకుటనియమాన్ని కలిగి శతక లక్షణాలతోనేఉన్నాయి
  
    కోయకుమీ సొరకాయలు
    వ్రాయకుమీ నవలలని అవాకు చెవాకుల్
    డాయకుమీ అరవ ఫిలిం
    చెయకుమీ చెబదుళ్ళు సిరిసిరి మువ్వా !

    బారెట్లా అయితే సాం
    బారెట్లా చెయ్యగలడు ?భార్యయెదుట తా
    నోరెట్లా మెదిలించును
    చీరెట్లా బేరమాడు ? సిరిసిరి మువ్వా ! లాంటి చాటువులు కనిపిస్తాయి .

చాటువులలోభాగంగా చివర ఫలశృతినికూడా చెప్పాడు  
    
   ఈశతకం యెవరైనా 
   చూసి,చదివి,వ్రాసి ,పాడి .సొగసిన  సిగరెట్ 
   వాసనలకు కొదవుండదు 
   శ్రీశు కరుణ  బలిమివలన సిరిసిరి మువ్వా !



సిరిసిరి మువ్వా శతకంలోని రసం హాస్యరసం
  వికారోమానసొభావ:హాస:నిర్వచనం .వికారమనగా వ్యంగ్యం .వ్యక్తుల,నాయకుల చెష్టలను వ్యంగ్యంగా చూపడంద్వారా సిరిసిరి మువ్వ శతకం చదివే పాఠకుడు హాస్యరసాన్ని అనుభవిస్తాడు .కావున ఇందలిరసం  హాస్యం.

 ఇన్ని ప్రాచీన కావ్య లక్షణాలను ఇముడ్చుకొని వ్రాసిన శతకం ఆదునిక కాలంలోనేకాదు  ప్రాచినకాలంలోకూడాలేదేమో .
  

   శ్రి శ్రీ సిరిసిరి  మువ్వ శతకం పాత సేసాలో కొత్త  సారాయి వంటిది